మహిళా కానిస్టేబుల్‌కు వార్నింగ్..మంత్రి కొడుకు అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా కానిస్టేబుల్‌కు వార్నింగ్..మంత్రి కొడుకు అరెస్ట్

July 13, 2020

nehaa01

కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధుల పిల్లలు చాలా నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తున్న పోలీసులను బెదిరిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి గుజరాత్ లోని సూరత్ నగరంలో జరిగింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కొడుకు అతడి ఇద్దరు స్నేహితులు కర్ఫ్యూను కూడా లెక్కచేయకుండా రాత్రి వేళలో కారులో తిరుగుతున్నారు. 

కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కొడుకు ప్రకాష్‌ను, అతని స్నేహితులను మహిళ కానిస్టేబుల్ సునీతా యాదవ్ నిలదీసింది. దీంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. తరువాత ఆ మహిళా కానిస్టేబుల్‌కు మంత్రి కొడుకు ఫోన్ చేసి..’మాకు పవర్ ఉంది.. నేను తలుచుకుంటే మమ్మల్ని ఎక్కడ నిలబెట్టావో అక్కడే నిన్ను సంవత్సరం మొత్తం నిల్చోబెడతా.’ అని బెదిరించాడు. ఆ వార్నింగ్‌కు సునీతా యాదవ్ బెదరకుండా..’సంవత్సరం మొత్తం అక్కడే నిలబెడితే నిల్చోడానికి నేను నీకు బానిసను కాదు, నీ తండ్రికి సర్వెంట్‌ను కాదు.’ అని అంతే ధైర్యంగా బదులిచ్చింది. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు మంత్రి కొడుకు తీరును విమర్శిస్తూ.. కానిస్టేబుల్ సునీతా యాదవ్ ధైర్యానికి ప్రశంసలు వ్యక్తపరుస్తున్నారు. ఈ వివాదం పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో పడడంతో మంత్రి కొడుకును అతడి స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.