జిగ్నేశ్‌ మేవానీకి షాక్... 3 నెల‌ల జైలు శిక్ష‌ - MicTv.in - Telugu News
mictv telugu

జిగ్నేశ్‌ మేవానీకి షాక్… 3 నెల‌ల జైలు శిక్ష‌

May 5, 2022

ఓ మహిళా పోలీసుపై దాడి చేసిన కేసులో అరెస్టయి నాలుగు రోజుల క్రితం బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన గుజ‌రాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీకి మ‌రో షాక్ త‌గిలింది. ఐదేళ్ల కిందటి మ‌రో కేసులో అనుమతి లేకుండా ‘ఆజాదీ మార్చ్‌’ నిర్వహించారన్న అభియోగంపై ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీతో పాటు మరో 9 మందికి మూడు నెలల శిక్ష విధించింది గుజ‌రాత్ మెజిస్టీరియల్‌ కోర్టు. అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ జేఏ పర్మార్‌.. మేవానీ, ఎన్‌సీపీ కార్యకర్త రేష్మా పటేల్‌ సహా రాష్ట్రీయ దళిత్‌ అధికార్‌ మంచ్‌లోని సభ్యులను దోషులుగా నిర్ధారించింది. 2017లో న‌మోదైన ఈ కేసుపై గురువారం తుది తీర్పు విడుద‌ల చేస్తూ ఈ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. జిగ్నేశ్ గుజ‌రాత్‌లోని వ‌గ్డాం నియోజ‌క వ‌ర్గానికి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.