Gujarat prince marries same sex
mictv telugu

గుజరాత్ యువరాజు గారి స్వలింగ వివాహం

July 11, 2022

స్వలింగ సంపర్కునిగా ప్రకటించుకొని దేశంలోనే అలా చెప్పిన మొదటి యువరాజుగా రికార్డు నెలకొల్పిన గుజరాత్ యువరాజు మన్వేంద్ర సింగ్ గోహిల్ తాజాగా ఓ ఇంటివాడయ్యారు. మరో స్వలింగ సంపర్కుడైన డీఆండ్రీ రిచర్డ్ సన్‌ను ఈ నెల 6న ఓహియోలో ఉన్న కొలంబస్ చర్చిలో వివాహం చేసుకున్నారు. ఈ విషయంతో పాటు పెళ్లి ఫోటోలు, వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలను షేర్ చేశారు. కాగా, 2006లో తనను తాను గేగా ప్రకటించుకున్న మన్వేందర్ ఓ యువతిని పెళ్లాడి ఆమె జీవితాన్ని నాశనం చేశానని బాధపడ్డాడు. తర్వాత 2018లో సుప్రీంకోర్టు సెక్షన్ 377ని రద్దు చేయడంతో తన ప్రాంతంలో గేల కోసం ఓ ఆశ్రయం ఏర్పాటు చేశాడు. తద్వారా ఆసియాలో మొదటి స్వలింగ సంపర్కుల ఆశ్రయంగా రికార్డు సాధించారు. అమెరికాకు చెందిన రచయిత జనేత్ పేరును ఆశ్రమానికి పెట్టాడు. అటు 2007లో ప్రసిద్ధ అమెరికన్ షో ఓఫ్రా విన్‌ఫ్రే, 2009కలో బీబీసీ అండర్ కవర్ ప్రిన్స్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. మాజీ మహరాజు రఘువీర్ సింగ్ రాజేంద్ర సింగ్ – రాజ్ పిప్లా ప్రాంత మాజీ యువరాణి రుక్మిణీ దేవీ సంతానంగా మన్వేంద్ర సింగ్ జన్మించారు.