Gujarat: Rift in BJP as Sitting MLa Kesarisinh Solanki Joins AAP
mictv telugu

బీజేపీకి బిగ్ షాక్

November 11, 2022

ఫస్ట్ లిస్ట్ ప్రకంపం రేపంది. బీజేపీ హైకమాండ్‌కు షాక్ ఇచ్చింది. అసమ్మతి బెడద కమలాన్ని కలవరపెడుతోంది.సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆప్..అసమ్మతీయుల్ని అక్కున చేర్చుకుంటోంది..టికెట్లు దక్కని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని తన్నుకుపోతోంది. ఈసారిత్రిబుల్ డిజిటే టార్గెట్ పెట్టుకున్న కమలం కొంపను కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ చాపకిందనీరులా ముంచేలా ఉంది. పోలింగ్‌కు ముందు జరుగుతున్న జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ ఆసక్తి రేపుతోంది.

అసమ్మతి సెగలు

గుజరాత్‌లో బీజేపీకి తిరుగులేదు. వరుసగా ఏడోసారి గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి. కానీ తొలి జాబితానే బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తుంది. 38 మంది సిట్టింగలకు టికెట్లు నిరాకరించడం మంటలు పుట్టిస్తుంది. ఈ 38 మందిలో ఐదుగురు మంత్రులు ఉన్నారు. సీనియర్లను వదిలేసి కొత్తగా వచ్చిన హర్దిక్ పటేల్ ‌లాంటోళ్లు టికెట్లు ఇచ్చారని సీనియర్లు రగిలిపోతున్నారు. కొందరు కాంగ్రెస్‌కు వెళ్తుంటే మరికొందరు ఆప్‌లోకి వెళ్తున్నారు. ఇప్పటికే మొదలైన వలసల పర్వం పోలింగ్ వరకు మరింత ఊపందుకుంటుంది.

ఆప్‌లోకి సిట్టింగ్‌లు

గుజరాత్ ఎన్నికల్లో తొలిసారిగా ఆప్ పోటీచేస్తుంది. టికెట్లు దక్కనోళ్లకు ఇది డోర్స్ తెరిచి పెట్టింది. మీకు మేమున్నాం..మా పార్టీ తరఫున పోటీ చేసి కమలంపై కసి తీర్చుకోండి అని కేజ్రీవాల్ సేన అసమ్మతివాదుల్ని ఆకర్షిస్తోంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేసరిసిన్హ సోలంకి ఆప్‌లో చేరారు మాతర్ అసెంబ్లీ స్థానం నుంచి కేసరిసిన్హ సోలంకి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. హార్డ్ వర్కర్ ,మంచి వాగ్దాటి ఉన్న నాయకుడిగా పేరుంది. అయినా ఈ సారి ఆయనకు బీజేపీ మొండిచెయ్యి చూపింది.” కేసరి సిన్హ సోలంకి హార్డ్ వర్కర్.గట్స్ ఉన్న నాయకుడు.నియోజకవర్గంలో మంచి పేరుంది. ఇలాంటి వాళ్లకోసం ఆప్ ఎదురుచూస్తుంది. నిజాయితీగా రాజకీయాలు చేసే వారిని ఆప్ ఎప్పుడు ఆహ్వానిస్తుంది”అని ఆప్ గుజరాత్ అధ్యక్షులు ఇటాలియా చెప్పారు. ఇతనే కాదు చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆప్‌లో చేరబోతున్నారని బాంబ్ పేల్చారు.

ఈసారి డబుల్ డిజిటేనా?
గుజరాత్‌లో త్రిబుల్ డిజిట్ సీట్లు సాధించాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది.తిరుగులేని విజయమం తమదేనంటూ ప్రచారంలో దూసుకుపోతోంది. కానీ ఫస్ట్ లిస్టే పరేషాన్ చేస్తుంది. కీలకమైన నేతల్ని కమలం దూరం చేసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 99 స్థానాలు వచ్చాయి. ఈసారి వందకు పైగా వచ్చేలా వ్యూహాలు రచించింది. కానీ మొదటి జాబితాతోనే మోసం వచ్చేలా ఉందని ఆపార్టీ నేతలు కలవరపడుతున్నారు.