రోడ్డుపై ఉమ్మినందుకు జరిమానా, గుంజీలు - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డుపై ఉమ్మినందుకు జరిమానా, గుంజీలు

August 30, 2019

ప్రపంచంలోని చాలా దేశాలు రోడ్లపై, పబ్లిక్ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నేరంగా భావిస్తున్నాయి. ఆయా దేశాల్లో రోడ్లపై ఉమ్మిన వారిపై తగు చర్యలు తీసుకుంటారు. భారీగా జరిమాన కూడా విధిస్తుంటారు. మన దేశం విషయానికి వస్తే గుజరాత్‌ ప్రభుత్వం రోడ్డుపై ఉమ్మి వేయడాన్ని నేరంగా భావిస్తోంది. సూరత్ మున్సిపాల్టీ అధికారులు ఈ రూల్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. ఎవరైనా రోడ్లపై ఉమ్మి వేస్తే జరిమానా వేస్తున్నారు. ఉమ్మి వేసి పారిపోయిన వారిని సీసీటీవీ కెమెరాల్లో వెతికి మరీ పట్టుకుంటున్నారు. 

కొన్ని నెలల క్రితం ఓ యువకుడు అద్వలైనిస్ టౌన్‌లో రోడ్డుపై ఉమ్మి వేసి ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. అప్పటినుంచి ఆ యువకుడి కోసం వెతికిన అధికారులు ఎట్టకేలకు అతన్ని పట్టుకొని జరిమానా వేశారు. అయితే తన దగ్గర డబ్బు లేదని జరిమానా కట్టనని ఆ యువకుడు తెలిపాడు. దీంతో అధికారులు ఆ యువకుడితో గుంజీలు తీయించి క్షమాపణలు కూడా చెప్పించారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు అధికారుల తీరుపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరం రోడ్లు శుభ్రంగా ఉండాలంటే ఇలా కఠినంగా వ్యవహరించాల్సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.