10లో 6 సబ్జెక్టులు తప్పాడు... 35 రకాల విమానాలు తయారు చేశాడు! - MicTv.in - Telugu News
mictv telugu

10లో 6 సబ్జెక్టులు తప్పాడు… 35 రకాల విమానాలు తయారు చేశాడు!

November 13, 2019

కొందరు డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు.. ఎన్ని చేసినా గుంపులో గోవిందయ్యల్లా మిగిలిపోతుంటారు. చదువులో ముందున్నా సృజనాత్మకతో చాలా మంది వెనకబడిపోతుంటారు. కొందరు ఏమాత్రం చదువుకోకపోయినా క్రియేటివిటీలో కేకలు పుట్టిస్తుంటారు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన 17 ఏళ్ల ప్రిన్స్ పంచాల్  అలాంటోడే. 10వ తరగతిలో ఏకంగా ఆరు సబ్జెక్లలో ఫెయిల్ అయినా ఆవిష్కరణల్లో మాత్రం అదరహో అనిపిస్తున్నాడు. 

అతడు ఇప్పటివరకు 35 రకాల విమానాలను తయారు చేశాడు. యూట్యూబ్‌లో చూసి చేసినా, చాలావాటికి తన సొంత ఊహలు రంగరించాడు. ఫెక్సీలు, అట్టలు, రేకులు వంటి నానా సామాగ్రితో వీటిని తయారు చేశారు. అవన్నీ కేవలం బొమ్మలు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. అన్నీ చక్కగా గాల్లో ఎగిరేవే. రిమోట్ కంట్రోల్ సాయంతో వీటిని నడుపుతున్న పంచాల్‌ను చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. అతడు 10 తప్పాడని తెలసి నోళ్లను మరింతగా తెరిచి వెళ్లబెడుతున్నారు! అంతేగా మరి.