విడాకులు ఇప్పించండి.. పబ్‌జీ ప్లేయర్‌ను పెళ్లాడతా..    - MicTv.in - Telugu News
mictv telugu

విడాకులు ఇప్పించండి.. పబ్‌జీ ప్లేయర్‌ను పెళ్లాడతా..   

May 18, 2019

Gujarat woman calls family counseling helpline seeking divorce to live with PUBG partner.

ఆటలు ప్రాణాలు తీస్తున్నాయి. పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. పబ్‌జీ గేమ్ భార్యభార్తలను విడదీస్తోంది. తమ భర్తలు గేమ్ ఆడనివ్వడం లేదంటూ భార్యామణులు కోర్టులు ఎక్కడడం ఎక్కువైపోయింది. ఇది వాటికి కొంచెం భిన్నమైన వార్త. భర్త బాగానే ఆడనిస్తున్నా, ఆమెకు సంతోషంగా ఉండడం లేదు. తోటి గేమ్ పార్ట్‌నర్‌ను పెళ్లాడాలన్న కోరిక పుట్టింది. విషయం ఏమాత్రం నీళ్లు నమలకుండా చెప్పేసింది.

 గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన సదరు సతీమణి వయసు 19. ఒక బుజ్జి కొడుకు కూడా ఉన్నాడు. పబ్‌జీ అంటే ఆమెకు ప్రాణం. దాన్ని ఆడకుండా గంట కూడా ఉండలేదు. దీనికి తోడు ఓ కుర్రాడు ఆమెకు పబ్జీ పార్ట్‌నర్‌గా తగిలాడు. ఆటపై ప్రేమో, అతనిపై ప్రేమో తెలీదుగాని ఆవిడ మాత్రం కాపురం తెగతెంపులు చేసుకోడానికి సిద్ధమైంది. కోర్టు దాకా వెళ్లడం ఎందుకని మహిళా హల్ప్‌లైన్‌ ‘అభయం’కు ఫోన్ చేసి, విడాకులు ఇప్పించాలని బతిమాలింది. కాపురాలు నిలపడం మొదట ప్రాధాన్యం కాబట్టి అధికారులు అమ్మాయి వెర్రి గురించి ఆరా తీశారు. గేమ్ ఆడ్డం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిందని, కౌన్సిలింగ్ కోసం రిహాబెలిటేషన్ సెంటర్‌కు రమ్మని చెప్పారు. దీనికి ఆమె దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. రిహాబిలిటేషన్ సెంటర్‌లోకి మొబైల్ ఫోన్ అనుమతించరు కనుక తాను రానని, ఫోన్ లేకుండా గేమ్ ఆడడం కుదరదని చెప్పేసింది.