కప్పు గెలిచింది 'గుజరాతే'..కానీ టాప్‌లో నిలిచింది 'ఆర్ఆరే' - MicTv.in - Telugu News
mictv telugu

కప్పు గెలిచింది ‘గుజరాతే’..కానీ టాప్‌లో నిలిచింది ‘ఆర్ఆరే’

May 30, 2022

ఐపీఎల్ 15 సీజన్ మ్యాచ్‌లు ఆదివారంతో ముగిసిపోయాయి. ఈ 15వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కప్పును సొంతం చేసుకొని, రికార్డ్ సృష్టించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. రాజస్థాన్ రాయల్స్‌కి బ్యాటింగ్ అప్పజేప్పింది. మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. 20 ఓవర్లకి 9 వికెట్లు కోల్పోయి, 130 పరుగులు చేసింది. జైశ్వాల్ (22), బట్లర్ (39), శాంసన్ (14), పడిక్కల్ (2), హెట్ మేయర్ (11), అశ్విన్ (6), రియాన్ (5), బౌల్ట్ (11), ఒటెడ్ మెక్కాయ్ (8), ప్రసిద్ధ కృష్ణ 0 నాటౌట్‌గా నిలిచాడు.

ఆ తర్వాత బ్యాటింగుకు దిగిన గుజరాత్ టైటాన్స్.. సాహా (5), గిల్ (45) నాటౌట్, మాథ్యూవేడ్ (8), హార్దిక్ పాండ్యా (34), మిల్లర్ (32) నాటౌట్‌గా నిలిచి, 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి, 133 పరుగులు చేసి కప్పును సొంతం చేసుకుంది. కానీ, కప్పు గెలిచింది గుజరాతే అయినా, రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు టాప్ ప్లేసులో నిలిచారు. మ్యాచ్‌లు మొదలైన రోజు నుంచి నిన్నటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ పరంగా, బౌలింగ్‌ పరంగా ఆర్ఆర్‌ జట్టు ఆటగాళ్లు రికార్డ్ సాధించారు. అందులో జోస్ బట్లర్.. అరుదైన రికార్డు సాధించాడు. ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా’, ‘పవర్ ప్లేయర్‌గా’, ‘గేమ్ చేంజర్‌గా’, ‘లెట్స్ క్రాక్ హిట్ సిక్సెస్‌గా’ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 15వ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా బట్లర్ ఘనత సాధించాడు. 2018లో 872 సిక్సర్ల రికార్డు ఉండగా, ఈ సీజన్లో 1,062 సిక్సర్లు బాదారు. అందులో బట్లర్ ఒక్కడే 45 సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఘనత నిలిచాడు.

ఇక, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌ల విషయానికొస్తే.. రెండూ క్యాప్‌లు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లకే దక్కాయి. జోస్ బట్లర్ 863 పరుగులు సాధించి, ఈ సీజన్‌లో రెండోవ అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోవడడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డును కూడా బట్లరే అందుకున్నాడు. రాజస్థాన్ బౌలర్ యజువేంద్ర చాహల్ 27 వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను అందుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడు ఉమ్రాన్ మాలిక్‌కు లభించింది.