ఒకప్పుడు టీమిండియా ప్రధాన బౌలర్, ప్రస్తుత గుజరాత్ టైటాన్స్ జట్టు హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కొత్త రికార్డు నెలకొల్పాడు. భారత్ నుంచి ఎవ్వరూ సాధించని రికార్డును సాధించి తొలి భారత క్రికెటర్‌గా పేరు సంపాదించుకున్నాడు. కనీసం ప్లేఆఫ్స్ వరకైనా చేరుతుందా అని సందేహించిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోవడంతో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తొలి ఇండియన్ కోచ్‌గా నిలిచాడు.
ఇప్పటివరకు ఏ భారతీయ కోచ్ కూడా ఈ రికార్డును సాధించలేదు. ఇంతేకాక, నెహ్రా ఆటగాడిగా ఉన్నప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున ఆడాడు. ఆరేళ్ల క్రితం హైదరాబాద్ జట్టు ట్రోఫీ గెలిచినప్పుడు నెహ్రా టీం సభ్యుడుగా ఉన్నాడు. దాంతో ఆటగాడిగా, కోచ్‌గా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన వ్యక్తిగా అరుదైన ఫీట్‌ను తన పేర లిఖించుకున్నాడు. దీంతో రికీ పాంటింగ్, షేన్ వార్న్ వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. కాగా, హెడ్ కోచ్‌గా నెహ్రా పనితీరును మెంటార్ అయిన గ్యారీ కిరెస్టైన్ కూడా మెచ్చుకున్నాడు. గుజరాత్ బ్యాట్స్‌మెన్ మాథ్యూవేడ్ స్పందిస్తూ టీంలో కుటుంబ వాతావరణం తేవడంతో నెహ్రా కృషి చాలా ఉందని మెచ్చుకున్నాడు.