Gujarati Indian sultan ate 35 kilos of food daily
mictv telugu

ఇతడు రోజుకు 35 కేజీల తిండి తినేవాడు!

November 3, 2022

కడుపు పగిలేలా తింటే బకాసురుడు అంటాం. ఒళ్లెరగకుండా నిద్రపోతే కుంభకర్ణుడు అంటాం. ఇవన్నీ ఏవో కథలని, ఆనాటి మనుషుల అలవాట్లను అతిశయోక్తిగా చెప్పడమేనని సరిపెట్టుకుంటారు కొందరు. కొందరైతే అలాంటి మహానుభావులు నిజంగా ఉన్నారేమో అనుకుంటారు. వారికి అలాంటి డౌట్ అక్కర్లేదు. చరిత్రలో కొందరు అలాంటి వారు చాలా మంది ఉన్నారు. మనదేశంలోనూ ఉన్నారు. యూట్యూబ్‌లో ఫుడ్ కంటెస్ట్ పోటీల్లో పదిమంది తినే బిర్యానీని ఒక్కరే లాగించేస్తున్న దాఖలాలు కోకొల్లలు. మరి ఒక మనిషి రోజుకు ఏకంగా 35 కేజీల తిండి తింటే? బతకడానికి కాక తినడానికే బతికితే? అచ్చం ఈ గుజరాత్ సుల్తాన్ మహమ్మద్ బెగేడా తతంగంలా ఉంటుంది. 35 కేజీల బరువైన తిండిని జీర్ణాశయం అరిగించుకోలేని మాట నిజమే. అయితే ఒక్కసారికాకుండా విడదల వారీగా, చివరికి రాత్రికూడా దఫదఫాలుగా తినేవాడట ఈ మహానుభావుడు. కేవలం తిండినే కాదు, విష పదార్థాలను కూడా వాతాపి జీర్ణయం చేసుకోవడం ఇతని ప్రత్యేకత. సమయానికి తొండి దొరక్కపోతే ఏది పడితే అది మెక్కేవాడు.

ఇదీ మెనూ…

పదిహేను, పదహారు శతాబ్దాల మధ్యలో జీవించిన మహమద్ బెగేడా గుజరాత్‌కు తిరుగులేని సుల్తాన్. ప్రఖ్యాత ద్వారక ఆలయాన్ని కూలగొట్టించిన ఇతడు ఇస్లాం మతంలోకి మారిన హిందువు. రాజకీయాలు పక్కనబెడితే చరిత్రలో మాంచి తిండిపోతుగా తిరుగులేని రికార్డులు నమోదు చేశాడు. బెగేడా పొద్దున అల్పాహారం కింద 150 అరటిపళ్లు, తేనె, వెన్న తినేవాడు. మాంసం, పళ్లు వగైరా అదనం. మధ్యాహ్నం మహారాజ భోజనమే. మాంసం, దిబ్బరొట్టెలు, పరమాన్నం, పలావు, పాయసాలు.. మరెన్నో. రాత్రి నిద్రలో ఆకలేస్తే భోజనాల గదికి, వంటగదికి వెళ్లి పనిమనుషులను ఇబ్బంది పెట్టకుండా చక్కని ఉపాయం పాటించేవాడు. మంచానికి రెండువైపులా చేయంత దూరంలో తిండి ఏర్పాట్లు చేసుకునేవాడు. మాంసం కూరిన పెద్దపెద్ద సమోసాలు ప్లేట్ల నిండా పెట్టించుకుని తొంగునేవాడు. ఇతని తిండి యావ మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది. చివరకు కప్పలను, పాములను కూడా వదలడని బార్బోసా వంటి యాత్రికులు కొందరు అతిగా రాశారు. అయితే సుల్తాన్ పాదుషాహా వారికి వాటిని తినాల్సిన అగత్యం లేదనుకోండి. తన గురించి జనం వింతగా చెప్పుకోవడం ఆయనకు తెలుసు. ‘ఏం చెయ్యమంటారు? అంతా దైవేచ్ఛ’ అనే వాడు.

పడుకుంటే చావాల్సిందే..

ఇతని శరీరం విషతుల్యం. లాలాజలాన్ని విషంగా ప్రయోగించి శత్రువులను చంపేవాడంటారు. అంత తిండి తినే మనిషి ఎంత బరువు ఉంటాడో ఊహించుకోవచ్చు. ఇతనితో శృంగారంలో పాల్గొన్న మహిళలకు నిజంగానే చచ్చేచావొచ్చేదిట. కవులు అతన్ని బలంలో భీముడని, దానంలో కర్ణుడని, గుణంలో శ్రీరాముడని, వైభవంలో ఇంద్రుడని పొగిగేవాళ్లు. బేగెడా చాలా యుద్ధాలు చేసి, రాజపుత్ర రాజ్యాలను కూలదోశాడు. దారుణమైన హింసాకాండకు తెగించాడు. అయినా అతని పేరు వింటే గుజరాతీయలకు గుర్తొచ్చేది బకాసుర రూపమే.