Gujarth cabel bridge accident video released
mictv telugu

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాదానికి ముందు జరిగింది ఇదే..

October 31, 2022

Gujarth cabel bridge accident video released

గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జి ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బ్రిడ్జికూలిన ఘటనలో 133 మంది జల సమాధి అయ్యారు. ప్రమాదానికి కారణానికి గల విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే బ్రిడ్జి కూలిపోయే ముందు కొంత మంది తీసిన వీడియోలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు కనిపించాయి. ప్రమాదానికి నిర్మాణ వైఫల్యంతో పాటు మానవతప్పిదాలు కూడా కారణమని ప్రమాద దృశ్యాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. 130 మందికి పైగా జలసమాధకి కొందరు అల్లరి మూకల చేష్టలు కూడా కారణంగా కనబడుతున్నాయి.

ప్రమాదానికి ముందు బ్రిడ్జిపై భారీగా వచ్చిన సందర్శకుల్లో కొంతమంది యువకులు బ్రిడ్జినీ ఊపుతూ కనిపించారు. అలా చేసిన కాసేపటికే ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలిపోయింది. పలువురు వారిని బ్రిడ్జిని ఊపొద్దని వారించినా వారు వినకుండా అటు ఇటూ ఎగురుతూ వీడియోలో కనిపించారు. దీంతో ఒక్కసారిగా అంతా నీటిలో పడిపోయారు. వారిలో ఈత వచ్చినవాళ్లంతా ఒడ్డుకు చేరగా.. పలువురిని త్రివధ దళాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు కాపాడారు. ఈ ప్రమాదంలో అనేక మంది చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు మరణించారు. ప్రమాదం అనంతరం బాధితుల ఆహాకారాలతో ప్రమాదస్థలి హృదయవిదారకంగా మారింది. ఇప్పటికీ ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మోర్బీలోని మచ్చూ నదిపై బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జ్‌కు మరమ్మత్తులు చేసి ఐదురోజుల క్రితమే అందుబాటులోకి తెచ్చారు..తెచ్చిన కొద్దిరోజులుకే ఘోర ప్రమాదం జరగడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. సేఫ్టీ పర్మిషన్ తీసుకోకుండానే బ్రిడ్జిని ప్రారంభించారని ఓ మున్సిపల్ అధికారి వెల్లడించారు. కెపాసిటీకి మించి సందర్శకులు రావడం, ఆకతాయిల చేష్టలు, నిర్మాణ వైఫల్యం ప్రమాదానికి ప్రమాద కారణాలుగా తెలుస్తోంది. ఘోర ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.మృతుల కుటుంబాలకు గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షలను నష్టపరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని గుజరాత్ సీఎం తెలిపారు. ఇప్పటికే పలువురు అధికారులు, కాంట్రాక్టులను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు..