Gulf countries banned Mohanlal's Monster film
mictv telugu

మోహన్ లాల్ ‘మాన్‌స్టర్’పై గల్ఫ్ దేశాల్లో నిషేధం.. కారణం ఇదీ

October 18, 2022

Gulf countries banned Mohanlal's Monster film

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం ‘మాన్‌స్టర్’ ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. చిత్ర బృందం ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటుండగా, గల్ఫ్ దేశాలు చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమ దేశాల్లో ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించాయి.

ఈ సినిమాలో లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ కంటెంట్ ఉండడంతో నిషేధం విధించినట్టు తెలుస్తోంది. మోహన్ లాల్ లక్కీ సింగ్ పాత్రలో నటించిన ఈ చిత్రం తాజా పరిణామంతో ఈ వారం విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. చిత్ర నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సెన్సార్ బోర్డ్ ఫర్ ఈ ఎవాల్యుయేషన్‌కు సినిమా కాపీని అందించారు. ఒకవేళ త్వరగా బోర్డు నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో సినిమా విడుదల అవుతుందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. కాగా, మంచు లక్ష్మీ కూడా నటించిన ఈ చిత్రానికి వ్యాసక్ దర్శకత్వం వహించారు. తెలుగులో మోహన్ లాల్‌కి మంచి మార్కెట్ ఉండడంతో తెలుగులోనూ విడుదల చేస్తారని టాక్ వినిపిస్తోంది.