నన్ను తోల్కపోండ్రి ..! - MicTv.in - Telugu News
mictv telugu

 నన్ను తోల్కపోండ్రి ..!

September 14, 2017

కాలం కాటేస్తే కొందరు, చేసిన అప్పులు తీర్చాలని కొందరు, నమ్ముకున్న కుటుంబాన్ని పోషించాలని కొందరు, బిడ్డె పెండ్లికని కొందరు, ఇలా పొట్ట చేత పట్టుకొని..కన్నవాళ్లని, కట్టుకున్న వాళ్లని ,ఉన్న ఊరిని ఇడ్శిపెట్టి  కూలీ నాలీ జేస్కునెదానికి బైటి దేశాలు..దుబాయ్, మస్కట్ ,సౌదీ అరేబియాలకు  పయనమైతుంటరు ఊర్లలో ఉన్న చాలామంది. కానీ అక్కడి వెళ్లాక  వాళ్లకు అసలు కష్టాలు మొదలవుతాయి..ఇస్తామన్న జీతం సరిగా ఉండదు, చెప్పిన పని ఒకటి ,ఆడికొయ్యినంక చేసే పని ఒకటి ఉంటుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లిన చాలా మంది పరిస్థితి ఇదే.

మెదక్ జిల్లా శంకరం పేట మండలం కాస్లపూర్  గ్రామానికి చెందిన జట్టి స్వామి అనేటాయ్న  పాపం పొట్టచేత పట్టుకొని గల్ఫ్ దేశం పొయ్యి నానా కష్టాలు పడుతున్నాడు. అక్కడ చేస్తున్న పని సరిగా లేదట, ఓనరు తిడుతూ, కొడుతూ ,టార్చర్ పెడుతున్నాడట, ‘మీకు దండం పెడ్త సార్  దయచేసి నన్ను ఇండియాకు తీస్కపోన్రి సార్, మీ దయసార్ ,ఇక్కడ నా డ్యూటీ సరిగా లేదు సార్, మా ఓనర్ నాకు నరకం చూపిస్తున్నాడు సార్, నాకు ఏడుపస్తుంది సార్, 3 నెలల నుంచి  పందామంటే  నిద్రకూడ పట్టడంలేదు సార్, నాకు ఉండబుద్దైతలేదు సార్, పద్మారావ్ సార్ ప్లీజ్ సార్  నన్ను దయచేసి నాకు సాయం జెయ్యండి. ఇండియాలనే ఏదన్న పని జేస్కొని బత్కుతా’ అని  ఏడ్సుకుంట  వాయిస్ మెసేజ్ ను తెలిసిన వాళ్ల వాట్సప్ కు పంపించాడు. ఇలాంటి సంఘటనలు బయిటికచ్చేవి కొన్నే…బయిటికిరాని ఇంకెన్నో.