బుల్లెట్ గాయాలు...అంతుచిక్కని ప్రశ్నలు ? - MicTv.in - Telugu News
mictv telugu

బుల్లెట్ గాయాలు…అంతుచిక్కని ప్రశ్నలు ?

July 28, 2017

కాంగ్రెస్ సీనియర్ నేత  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కు బుల్లెట్ గాయాలు,ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లోని అలోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు,అతనికి ప్రాణాపాయం ఏం లేదని వైద్యులు చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు.

అసలేం జరిగింది..?

రాత్రి 12 గంటల ప్రాంతంలో విక్రమ్ గౌడ్ ఇంటికి వచ్చాడట,అయితే అర్ధరాత్రి 3.30 టైంలో ఒక్కసారిగా ఇంట్లో కాల్పుల శబ్దం,విక్రమ్ భార్య పైన గదిలో నిద్రిస్తున్నారట, ఒక్కసారిగా ఏదో పెద్ద శబ్దం వినపడేసరికి విక్రమ్ భార్య కిందికి వచ్చారట.. అంతే ఒక్కసారిగా రక్తపు మడుగులో ఉన్న విక్రమ్ ను  చూసి ఆమె షాకయ్యిందట. అయితే ఈకాల్పులు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు చేసారా?లేకపోతే విక్రమ్ సూసైడ్ అటెమ్ట్ చేసాడా అన్నది పోలీసులు నిర్థారించాల్సింది ఉంది.విక్రమ్ ఛాతీ మరియు కుడి చేతి భాగంలో రెండు రౌండ్ ల బుల్లెట్ లు దూసుకెళ్లాయి.