పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఇదేనేమో. చిన్న ప్రాణి అయిన బల్లిని చంపడానికి ఓ వ్యక్తి ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. మొఘల్ పురాలోని సుల్తాన్ షాహీలో ఈ నెల 1న ఈ సంఘటన జరిగింది. అఫ్సర్ అనే వ్యక్తి తన ఇంట్లో గోడపై ఉన్న బల్లిని చంపడానికి తుపాకీతో కాల్పులు జరుపగా, బుల్లెట్ ధాటికి గోడ పెచ్చులు ఊడిపోయాయి. ఊడి అక్కడే ఉన్న ఎనిమిదేండ్ల బాలుడి తలపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఏ ఆయుధంతో కాల్పులు జరిపారనే కోణంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.