ఖైరతాబాద్ గణపతి అంత ఎత్తయిన రోబో.. జపాన్ అద్భుతం - MicTv.in - Telugu News
mictv telugu

ఖైరతాబాద్ గణపతి అంత ఎత్తయిన రోబో.. జపాన్ అద్భుతం

September 23, 2020

Gundam as god – Photo shows real-life giant anime robot getting deep respect

ఖైరతాబాద్ వినాయకుడు 60 అడుగుల ఎత్తు ఉంటాడు. కరోనా రాకపోయుంటే ఈసారి ఎత్తు మరింత పెరిగేదేమో. తల పైకెత్తి చూసి పూర్తిగా కనిపించని ఆ విగ్రహాన్ని చూడ్డానికి భక్తజనం పోటెత్తుతారు. మరి ఆ వినాయకుడు కదిలితే! అటూ ఇటూ తిరిగితే!  ఎలా ఉంటాడో ఊహించుకోడానికి జపనీయులు తయారు చేసిన భారీ హ్యూమనాయిడ్ రోబో దారి చూపుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హ్యూమనాయిడ్ రోబోను జపాన్‌లోని గుండామ్ ఫ్యాక్టరీ తయారు చేసింది. 

దీని ఎత్తు 60 అడుగులు. బరువు 25 టన్నులు. పేరు RX-78. ఇది మోకాళ్లపై కూర్చుంటుంది. వేళ్లను ఆకాశంవైపు చూపుతుంది. మరెన్నో చేస్తుంది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ రోబో వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. గుండ్ అనే టీవీ షో పాత్ర ఆధారంగా యొకహోమాలో దీన్ని తయారు చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి. దీని నిర్మాణంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామని డిజైనర్లు అంటున్నారు.