గుండు హనుమంతరావు వెళ్లిపోయారు - MicTv.in - Telugu News
mictv telugu

గుండు హనుమంతరావు వెళ్లిపోయారు

February 19, 2018

ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు  ఇక లేరు. ఆయన సోమవారం తెల్లవారుజామున 3 గంటలప్పుడు హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని స్వగృహంలో కన్నుమూశారు. 61 ఏళ్ల  హనుమంతరావు కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. ఒక కూతురు, భార్య ఇదివరకే చనిపోయారు.  హనుమంతరావు 400 పైగా సినిమాల్లో నటించారు. విజయవాడలో జన్మించిన ఆయన సినిమాల్లోకి రాకముందు స్వీట్ల వ్యాపారం చేశారు. కొబ్బరిబోండాం, మాయలోడు, యమలీల, వినోదం సినిమాలతో చక్కని గుర్తింపు  తెచ్చుకున్నారు. ‘అహనా పెళ్లంట’  సినిమాతో ఆయన తెరంగేట్రం చేశారు. కొన్నాళ్లుగా ఆరోగ్యం క్షీణించడంతో సినిమాలకు దూరమయ్యారు. హనుమంతరావు బుల్లితెరపైనా ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన అమృతం సీరియల్‌  ప్రేక్షకాదరణ పొందింది. అనారోగ్యం, ఆర్థిక కష్టాలతో బాధపడుతున్న హనుమంతరావుకు ఇటీవల సినీనటుడు చిరంజీవి రూ.2లక్షల ఆర్థికసాయం చేయడం తెలిసిందే. మరోపక్క.. తెలంగాణ ప్రభుత్వం కూడా సీఎం సహాయనిధి నుంచి రూ.5లక్షలు మంజూరు చేసింది. హనుమంతరావు మృతికి పలువురు సీనీ ప్రముఖలు సంతాపం తెలిపారు.