మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. మెక్సికోలోని గ్వానాజువాటోలో బార్‌పై గుర్తుతెలియని దుండగులుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పది మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. మృతుల్లో ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11 గంటల తర్వాత ఎల్ ఎస్టాడియో బార్‌లో దాడి జరిగిందని తెలిపారు.
💢Nueva masacre en Guanajuato deja 8 muertos y 20 heridos‼️
🚨Sucedió esta madrugada en el Table Dance “Estadio” de Apaseo el Grande, varios sujetos dispararon contra otro grupo dentro del local.
Así gobierna el PAN con su fiscal #CarlosZamarripa #MasacreGuanajuato #ESTADIO pic.twitter.com/UjQNXtlaTf
— Andrey de la Mancha (@AndreyGMaya) March 12, 2023
ఇద్దరు సాయుధ వ్యక్తుల బృందం నగరాలను కలిపే హైవే వెంబడి ఎల్ ఎస్టాడియో బార్‌పై దాడి చేసిందని ఆయన చెప్పారు. సెలయా, క్వెరెటారో నగరాలను కలిపే ఒక హైవే వెంబడి బార్ కస్టమర్‌లు, ఉద్యోగులపై సాయుధ వ్యక్తుల గుంపు ప్రవేశించి కాల్పులు జరిపారు. గ్వానాజువాటో ఒక సంపన్న పారిశ్రామిక ప్రాంతం. ఇది మెక్సికో యొక్క అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు కూడా నిలయం. దేశంలోనే అత్యంత రక్తపాత రాష్ట్రంగా మారింది. గతేడాది నవంబర్‌లో కూడా గ్వానాజువాటో నుంచి ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఆ సమయంలో ఆయుధాలతో ఒక బృందం బార్ వద్దకు వచ్చిందని, ఆ తర్వాత కాల్పుల ఘటన జరిగిందని ఒక అధికారి చెప్పారు. బుధవారం సెలయా వెలుపల ఉన్న అపాసియో ఎల్ ఆల్టో పట్టణంలోని ప్రజలపై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు.