Gunfire in front..chasing the bike
mictv telugu

నల్గొండ జిల్లాలో కాల్పుల కలకలం..బైక్‌ను వెంబడించి

August 5, 2022

తెలంగాణలోని నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో గురువారం రాత్రి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యాపారిపై కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. బైక్‌ను వెంబడించి, మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆ వ్యాపారి అపస్మా రక స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

”నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి (32) మునుగోడులో ఓ దుకాణాన్ని కిరాయికి తీసుకోని కూల్ డ్రింక్స్, నీళ్ల బాటిళ్ల వ్యాపారం చేస్తున్నాడు. దీంతోపాటు రియల్‌స్టేట్ వ్యాపారం కూడా చేస్తూ, బ్రాహ్మణవెల్లంలలోనే నివాసం ఉంటున్నాడు. రోజూలాగే గురువారం దుకాణం మూసేసి, బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తుండగా, మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి పిస్తోలుతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లింగస్వామి చనిపోయినట్లు దుండగులు భావించి, అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల శబ్దం విన్న స్వామి అనే వ్యక్తి, మాకు సమాచారం అందించాడు. దాంతో మేం హుటహూటిన ఘటన స్థలానికి చేరుకొని, అపస్మారక స్థితిలోకి వెళ్లిన లింగస్వామిని నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించాం. అనంతరం ఘటన స్థలంలో ఓ బుల్లెట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నాం” అని ఎస్సై సతీషరెడ్డి తెలిపారు.