అమ్మవారి కిరీటం దొంగ అరెస్ట్.. ఎందుకు చేశాడంటే - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మవారి కిరీటం దొంగ అరెస్ట్.. ఎందుకు చేశాడంటే

November 30, 2019

Durga Bhavani ...

భక్తి ముసుగులో గుడికి వెళ్లి చాకచక్యంగా అమ్మవారి వెండి కిరీటం దొంగలించడం సంచలనం రేపింది. ఈ నెల 20న గన్‌ఫ్రౌండ్రీలో దుర్గా భవాని ఆలయంలో ఈ ఘటన జరిగింది. అమ్మవారికి దండం పెట్టి, గుంజీలు తీసి తీరిగ్గా కిరీటం ఎత్తుకెళ్లాడు. ఆ వ్యక్తిని ఎట్టకేలకు అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వెండి కిరీటాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఈ చోరికి పాల్పడింది కోఠికి చెందిన అద్వానీ కిరణ్ కుమార్‌‌గా పోలీసులు గుర్తించారు. చాలా కాలంగా చిల్లరగా తిరుగుతూ కనిపించిన వారి వద్ద అప్పులు చేసే వాడు. అప్పులు భారీగా పెరిగిపోవడంతో అతడిపై ఒత్తిడి పెరిగింది. డబ్బు సంపాధించే మార్గంలేక దొంగతానానికి పాల్పడ్డాడు. ఏకంగా అమ్మవారి వెండి కిరీటంపైనే కన్నేసి దాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ వివరాలన్ని సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో దాని ఆధారంగా పోలీసులు నిందితున్ని గుర్తించారు. అప్పులు తీర్చేందుకే అలా చేసినట్టు కిరణ్ వెల్లడించారు.