ధనాధన్.. కాల్చేస్తూ ట్విటర్‌లో లైవ్ ఇచ్చాడు - MicTv.in - Telugu News
mictv telugu

ధనాధన్.. కాల్చేస్తూ ట్విటర్‌లో లైవ్ ఇచ్చాడు

March 15, 2019

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చి ప్రాంతంలో కాల్పులకు తెగబడిన ముష్కరుడు పక్కా పథకం ప్రకారం ఊచకోతకు పాల్పడ్డాడు. కాల్పులు జరుపుతూ ఏకంగా 17 నిమిషాల పాటు సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చాడు. తన ముఖం కూడా చూపాడు. తనది ఆస్ట్రేలియా అని తన పేరు బ్రెంటన్ టారంట్ అని చెప్పుకొచ్చాడు.

కారులో వచ్చిన దుండగుడు తన వెంట తుపాకులు, పెట్రోల్ బాంబులు వగైరా తెచ్చుకున్నాడు. యథాలాపంగా అల్ నూర్ మసీదులోకి వెళ్తూ కనిపించిన వారినల్లా పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్చేశాడు. శవాల పక్కనుంచి వెళ్లడం, తర్వాత గన్‌లో తూటాలను మళ్లీ లోడ్ చేసుకోవడం ఫుటేజీలో కనిపిస్తోంది. కాల్పుల్లో 40 మంది చనిపోయారని, 25 మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. నలుగురి అదుపులోకి తీసకుని ప్రశ్నిస్తున్నామని, పూర్తి వివరాలను ఈ సాయంత్రం వెల్లడిస్తామని పేర్కొన్నారు.