Home > Featured > పాక్ సైనిక దుర్మార్గాలపై గళమెత్తిన హక్కుల కార్యకర్త దారుణ హత్య.. 

పాక్ సైనిక దుర్మార్గాలపై గళమెత్తిన హక్కుల కార్యకర్త దారుణ హత్య.. 

Gunmen Critically Injure Pashtun Rights Activist In Pakistan's Tribal Areas

మనదేశంలో మాదిరే పాక్‌లోనూ హక్కుల కార్యకర్తలకు రక్షణ కరువైంది. పష్తూన్ల్ జాతి ప్రజల హక్కుల కోసం, వారిపై పాక్ సైనికుల, పోలీసులు దుర్మార్గాలకు వ్యతిరేకగంగా పోరాడిన సామాజిక ఉద్యమాకారుడు సర్దార్ ఆరిఫ్ వజీర్‌ను దుండగులు పొట్టనబెట్టుకున్నారు. పాకిస్తాన్‌లో పాష్తూన్ తహఫజ్ మూవ్‌మెంట్ (పీటీఎమ్‌) నాయకుడైన ఆరిఫ్ వజీర్‌ నెలరోజుల క్రితమే బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఖైబర్ పక్తుంఖ్వా రాష్ట్రం దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలోని వనా పట్టణానికి చెందిన ఆయనపై శుక్రవారం రాత్రి దుండుగులు కాల్పులు జరిపారు. తన ఇంటి సమీపంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పరారయ్యారు.

వెంటనే మహ్మద్ అలీ, వజీర్‌ను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి ఇస్లామాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన మృతిచెందారు. కాగా, 2017లో కూడా వజీర్‌తో గొడవపడ్డ కొందరు ఉగ్రవాదులు అతని కుంటుంబంలోని ఏడుగురిని కాల్చిచంపారు.

Updated : 2 May 2020 9:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top