సిక్కుల గుడిపై ఐసిస్ దాడి.. 27 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

సిక్కుల గుడిపై ఐసిస్ దాడి.. 27 మంది మృతి

March 25, 2020

Gunmen Storm Sikh Religious Complex

కరోనా బారిన పడకుండా మాస్కులు పెట్టుకోవాలని, జనానికి దూరంగా ఉండాలని  తన ఉగ్రవాదులకు సూచనలు ఇస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ఇస్లామేతర మతాలవారిపై మాత్రం దాడులు ఆపడం లేదు. అఫ్గానిస్తాన్‌లో ఐసిస్ మళ్లీ మారణకాండకు తెగబడింది. కాబూల్‌లోని షోర్‌ బజార్‌ ప్రాంతంలో ఉన్న సిక్కుల ప్రార్థనా మందిరం గురుద్వార్‌పై కాల్పులకు తెగబడ్డారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 27 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాల్పు ఘటనతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ఆ ప్రాంతం అంతా భయానకంగా మారిపోయింది. వెంటనే  అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు గాయాలతో లోపల చిక్కుకుపోయిన సిక్కులను ఆస్పత్రికి తరలించారు. 

ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఓ గ్రూపుగా వచ్చిన ఉగ్రవాదులు దీనికి తెగబడ్డారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిపై దాడి చేసి మరీ కాల్పులకు తెగబడ్డారు. దాడి సమయంలో సుమారు 150 మంది సిక్కులు మందిరంలో ఉన్నారు. ఇది తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటన విడుదల చేసింది. గురుద్వారపై దాడి ఘటనను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. వివిధ దేశాల్లో మైనార్టీలపై జరుగుతున్న మతపరమైన దాడులను ఖండించింది.  మత స్వేచ్చను కాపాడాల్సిన సమయమని ట్వీట్ చేశారు.