బొంద తవ్వించి మరీ చంపారు..! - MicTv.in - Telugu News
mictv telugu

బొంద తవ్వించి మరీ చంపారు..!

September 2, 2017

మనకు ఎవరిమీదైనా పట్టలేనంత కోపమొస్తే ‘నిన్ను బొంద పెడతా..’ అంటుంటాం..! బ్రిజిల్లోని నేరగాళ్ల గ్యాంగులు ఈ విషయంలో ఇంకో ఆరు బొందలు ఎక్కువ తవ్వాయి… కన్ఫ్యూజ్ కాకండి.. వాళ్లు ఏం చేశారంటే..

బ్రెజిల్ లోని డ్రగ్స్ ముఠాల మధ్య ఘోరమైన పోటీ ఉంది. ప్రత్యర్థులను వేటాడి చంపండం అక్కడ సర్వసాధారణ విషయం. అయితే ఇటీవల గావతాయ్ ప్రాంతంలో జరగిన ఉదంతం మరింత ఘోరమైంది. స్థానిక డ్రగ్స్ ముఠాల మధ్య కొంత కాలంగా గొడవలు సాగుతున్నాయి. ఓ ముఠాలోని వాగ్నర్ డా రోసా, విక్టర్ డా రోసా అనే యువకులను వారి ప్రత్యర్థి ముఠాసభ్యులు ఇటీవల పోర్ట్ అలెగ్ర్ లో పట్టుకున్నారు. పాత పగలు గుర్తుకొచ్చాయి. అంతే.. వారిని మామూలుగా కాకుండా కొత్తగా చంపాలనుకున్నారు. వరుసకు అన్నదమ్ములైన వాగ్నర్, విక్టర్ లను చంపే ముందు.. వారితో గొయ్యి తవ్వించారు. ‘మిమ్మల్ని పూడ్చిపెట్టడానికి మేమెందుకు గొయ్యి తవ్వాలి. మీరే తవ్వుకోండి’ ని తుపాకీతో బెదిరించి గొయ్యి తవ్వించారు.

తర్వాత వారిద్దరిని ఆ గొయ్యిలో పడుకోబెట్టారు. తుపాకీ కాల్పులకు బెదిరిపోకుండా ఒకరి ముఖం ఒకరికి కనిపించేలా దగ్గరగా పడుకోమని చెప్పారు ఉచిత సలహాగా. తర్వాత విచక్షణా రహితంగా వారిని కాల్చి చంపారు..

పగ అంతటితో చల్లారలేదు. వాళ్లిద్దరి శవాలను తర్వాత పెట్రోల్ పోలి కాల్చేశారు. ఈ మొత్తం తతంగాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించి మీడియాకు అందించారు..