Guns found in Telangana assembly premises
mictv telugu

తెలంగాణ అసెంబ్లీ వద్ద కలకలం.. చెత్త కుప్పల్లో తుపాకులు లభ్యం

October 21, 2022

హైద్రాబాద్ నగరంలోని తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం కలకలం రేగింది. ప్రాంగణంలో శుభ్రపరుస్తుండగా, చెత్తకుప్పల్లో ఓ తపంచాతో పాటు రెండు కంట్రీమేడ్ తుపాకులు లభ్యమయ్యాయి. శాసనమండలి భవనానికి ఆనుకొని ఉన్న జూబ్లీహాల్ పరిసరాల్లో దొరకడంతో ఆందోళనకు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలో ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా జూబ్లీహాల్‌లో జరిగేవి. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యేవారు. అలాంటి ప్రదేశంలో తుపాకులు దొరకడంతో సంచలనంగా మారింది.