మత్తు మందిచ్చి ఇంజనీరింగ్ విద్యార్థినిని కాటేశారు.. వీడియోలు తీసి.. - MicTv.in - Telugu News
mictv telugu

మత్తు మందిచ్చి ఇంజనీరింగ్ విద్యార్థినిని కాటేశారు.. వీడియోలు తీసి..

June 27, 2020

Guntur

గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని సహ విద్యార్థులే కాటేశారు. విద్యార్థినికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి, అశ్లీల వీడియోలు చిత్రీకరించారు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని సదరు బాధితురాలని బెదిరిస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. రోజురోజుకు వారి వేధింపులు ఎక్కువ అవడంతో.. భరించలేకపోయిన బాధితురాలు తన కుటుంబసభ్యులకు అసలు విషయం చెప్పింది. దీంతో వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై దిశ పోలీసులు వెంటనే స్పందించారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ కౌశిక్, వరుణ్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారి పైనా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. కాగా, ఈ లైంగిక దాడి ఘటన మూడేళ్ల కిందట జరిగినట్టు సమాచారం. శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మూడేళ్ల తర్వాత తాజాగా ఆమె వీడియోలను అంతర్జాలంలో పెడతామని బెదిరిస్తూ వేధింపులకు దిగారు.