కులం ఏంటో చెప్పండి.. వైసీపీ ఎమ్మెల్యేకు కలెక్టర్ ఆదేశం  - MicTv.in - Telugu News
mictv telugu

కులం ఏంటో చెప్పండి.. వైసీపీ ఎమ్మెల్యేకు కలెక్టర్ ఆదేశం 

November 19, 2019

MLA Sridevi.

తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విచారణకు రావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆమె కుల ధృవీకరణ తప్పు అంటూ ఫిర్యాదులు రావడంతో నోటీసులు ఇచ్చారు. ఈనెల 26న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయంలో దీనిపై విచారణ జరగనుంది.  ఆమె కులధృవీకరణకు సంబంధించిన సరైన పత్రాలను వెంట తెచ్చుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు.

కొన్ని రోజులు క్రితం ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులానికి చెందిన వ్యక్తి అంటూ శ్రీదేవి చెప్పుకున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోశ్ అనే వ్యక్తి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో రిజర్వుడు నియోజకవర్గంలో పోటీ చేశారని పేర్కొన్నాడు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని ఈసీ కలెక్టర్‌ను ఆదేశించింది. శ్రీదేవి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె తన కుల నిరూపణ చేసుకోవాలంటూ నోటీసులు ఇచ్చారు. కాాగా దళితులు క్రైస్తవ మతం స్వీకరించిన సమయంలో వారికి కల్పించిన రిజర్వేషన్ కోల్పోవాల్సి ఉంటుంది.