వైద్యం మానేసి మద్యం అమ్ముతున్న డాక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

వైద్యం మానేసి మద్యం అమ్ముతున్న డాక్టర్

May 26, 2020

gn vn

రోగులకు వైద్యం చేస్తూ.. వారి ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్ దారి తప్పాడు. డబ్బులు సంపాధించడమే పరమావదిగా అడ్డదారులు తొక్కాడు. మద్య నిషేధాన్ని సైతం పట్టించుకోకుండా వైద్యం మానేసి మద్యం అమ్మకాలను గుట్టుగా సాగించడం ప్రారంభించాడు. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుంటూరు జిల్లా రాజేంద్ర నగర్‌లో చోటు చేసుకుంది. అతని వద్ద నుంచి 53 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. 

ఏపీలో బెల్ట్ షాపుల నిర్వహణకు అనుమతి లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటంతో మద్యం ద్వారా డబ్బులు సంపాధించాలని డాక్టర్ లావు వంశీ కృష్ణ అనుకున్నాడు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి తెలిసిన వారికి తరుచూ సప్లై చేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు ప్రారంభించారు. ఆ సమయంలో వంశీకృష్ణ కారు డిక్కీలో 16 మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. వాటికి కర్ణాటక లేబుల్స్ ఉన్నట్టు గుర్తించారు. 

ఇంటికి వెళ్లి సోదా చేయగా, విదేశీ స్కాచ్‌ విస్కీతో పాటు మరో 37 దేశీయ మద్యం సీసాలు లభించాయి. దీంతో అతని వద్ద ఉన్న రూ.20 లక్షల విలువ చేసే కారు, మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. తన స్నేహితుడు రహీంబేగ్‌ సాయంతో దందా నడుపుతున్నట్టుగా తేలడంతో అతని కోసం గాలిస్తున్నారు.