గుంటూరులో దారుణం..అప్పు కట్టమంటే కుక్కల్ని వదిలాడు - MicTv.in - Telugu News
mictv telugu

గుంటూరులో దారుణం..అప్పు కట్టమంటే కుక్కల్ని వదిలాడు

July 8, 2020

m,nn.k

అప్పు తీసుకొని తిరిగి ఇవ్వాలని అడిగినందుకు కోపంతో ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమెపైకి పెంపుడు కుక్కలను వదిలాడు. అంతటితో ఆగకుండా విచక్షణ రహితంగా దాడి చేశాడు. దుర్భాషలాడుతూ తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. గుంటూరు జిల్లాలో ఇది జరిగింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పిడుగురాళ్లలో ఉండే భూక్యా రంజిత్ నాయక్ అనే రైల్వే ఉద్యోగి అమరావతి మండలం మద్దూరు గ్రామానికి చెందిన రామావత్ చంపల్లి (70) వద్ద రెండు సంవత్సరాల క్రితం ఐదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఇటీవల అవసరం నిమిత్తం తిరిగి ఇవ్వాలని ఆమె అతని ఇంటికి వెళ్లింది. గొడవ జరగడంతో పెద్దమనుషుల సమక్ష్యంలో గడువు పెట్టి ఓ ఒప్పందం చేసుకున్నారు. తీరా గడువు దగ్గర పడటంతో రంజిత్ ఇంటికి వెళ్లగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వృద్దురాలిపై దాడి చేశారు. పెంపుడు కుక్కలను వదలడంతో ఆమె భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీసులను ఆశ్రయించింది. తనకు తిరిగి డబ్బులు ఇచ్చేలా చేయాలని పోలీసులను వేడుకుంది.