Guntur Software Engineer Srinath Dies While Trekking In Us
mictv telugu

అమెరికాలో టీడీపీ నేత అల్లుడి మృతి.. ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి..

October 18, 2022

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గుంటూరుకు చెందిన గంగూరి శ్రీనాథ్ (32) ట్రెక్కింగ్ చేస్తుండగా జారిపడి మృతి చెందాడు. వీకెండ్ కావడవంతో సరదాగా ట్రెక్కింగ్‌కు వెళితే ప్రాణాలు పోయాయి. గుంటూరుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు, రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణికి.. రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం ఫ్లోరిడాలో ఉంటుండగా.. అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో భార్యాభర్తలు అట్లాంటాలో క్లీవ్‌లెన్స్‌ మౌంటెన్‌ హిల్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అక్కడ ఎత్తైన ప్రదేశంలో వెళ్లిన శ్రీనాథ్‌ ప్రమాదవశాత్తూ 200 అడుగుల ఎత్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు.

కుమారుడి మరణవార్త తెలియడంతో శ్రీనాథ్‌ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. శ్రీనాథ్‌ మృతదేహాన్ని గుంటూరుకు తీసుకువచ్చేందుకు వారం సమయం పట్టే అవకాశం ఉందని మృతుడి మామ సుఖవాసి శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి.. గుంటూరుకు చెందిన ఎన్‌ఆర్ఐలు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.. వారికి సాయం అందిస్తున్నారు. సుఖవాసి శ్రీనివాసరావును టీడీపీ నేతలు పరామర్శించారు.. అల్లుడి మరణంపై సంతాపాన్ని తెలియజేశారు.