ముగ్గురు పిల్లలు పుట్టాక.. భార్య నల్లగా ఉందని వేధింపులు - MicTv.in - Telugu News
mictv telugu

ముగ్గురు పిల్లలు పుట్టాక.. భార్య నల్లగా ఉందని వేధింపులు

October 20, 2020

incident

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలు పుట్టాక భార్యను వదిలించుకోవాలి అనుకున్నాడు ఓ భర్త. బాధిత యువతికి 2015లో వివాహమైంది. ముగ్గురు పిల్లలు పుట్టారు. గత కొద్దికాలంగా విడాకులు కావాలని భర్త ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. 

నల్లగా ఉందని నిందిస్తూ కాపురం చేయడానికి నిరాకరించాడు. నిత్యం సూటిపోటి మాటలతో మానసికంగా వేధించేవాడు. అయినా ఆమె వినకపోవడంతో భౌతికంగా హింసించడం మొదలుపెట్టాడు. విడాకులు ఇవ్వకుంటే చంపేస్తామంటూ కిరోసిన్ డబ్బాతో బెదిరించాడు. ప్రాణ భయంతో ఆమె రోడ్డుపైకి పరుగులు పెట్టింది. భర్త నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. అర్బన్ ఎస్పీని కలిసి భర్తపై ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆమె సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.