ఎవరి పేరు చెబితే ప్రభుత్వాలు వణికిపోతాయో...... - MicTv.in - Telugu News
mictv telugu

ఎవరి పేరు చెబితే ప్రభుత్వాలు వణికిపోతాయో……

August 24, 2017

ఎవరి పేరు చెబితే  ప్రభుత్వాలు గజ్జున  వణికి పోతాయో…  కంపెనీల కొద్ది పోలీసులు బలగాలు దిగిపోతాయో. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటిస్తాయో ఆయనే…. డేరా స్వచ్ఛ సౌదా ఛీఫ్ గుర్మిత్  రాం రహీమ్ సింగ్ బాబా. ఈయన గారిని ఓ అత్యాచారం కేసులో అరెస్టు చేస్తారని తెలియగానే వేల నుండి లక్షల సంఖ్యలో ఆయన అభిమానులు హర్యాణ, పంజాబ్ రాష్ట్రాలుక పోటెత్తారు.  బాబా గార మహిళా భక్తులపై అత్యాచారానికి పాల్పడ్డారనే అరోపణలు ఎదుర్కొంటున్నారు.

దీనిపై కోర్టులో కేసు పడింది.దానిపై వివాదం  ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈయన  అందరి లాంటి బాబా కాదు రాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయన నటించిన  సిన్మా వంద కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఇప్పుడీయన ముచ్చటెందుకొచ్చిందంటే….

క్రికెట్  ప్లేయర్ కోహ్లీకి, ప్రొఫెషనల్ రెజ్లర్ విజేందర్ సింగ్ లకు పాఠాలు నేర్పింది తానేనని చెప్పారు.తనకు ఆటల గురించి ఏటూ జెడ్ తెల్సని అంటున్నారు. అంతే కాదు తాను 32 నేషనల్ గేమ్స్ ఆడినట్లు చెప్పుకున్నారు.

చాలా మంది ఆటగాళ్లకు తానే  గురువునని సెలవిచ్చారు. ఇంకా నయం టెండూల్కర్ కు బ్యాటు పట్టుకోవడం నేర్పిందీ నేనే అని చెప్పలేదని కొందరు అనుకోవచ్చేమో. కానీ ఈయన   మాట్లాడిన వీడియో  దేశంలో హల్ చల్ చేస్తున్నది. బాబా ఏం చేసినా సంచలనమే. ఇప్పుడిదో సంచలనం.