డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ అత్యాచార కేసు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు వెతికాలో అన్న మార్గాలూ వెతికాడు. చివరకు ‘నేను అసలు మగాన్నే కాను. నాకు మగతనం లేదు. నేను రేప్ ఎలా చేస్తాను.. ’ అని కూడా బొంకాడు. అయితే సీబీఐ కోర్టు అతగాడి వాదనలేమీ పట్టించుకోకుండా సాక్ష్యాధారాలను బట్టి జైలుకు పంపింది.
తనకు క్షమాభిక్ష పెట్టి వదిలేయాలని బాబా కోర్టును కోరడం తెలిసిందే. ఆయన దోషి అనడానికి కోర్టులో ఆయన వ్యవహరించిన తీరు స్పష్టమైన ఆధారమని పరిశీలకులు భావిస్తున్నారు. తప్పు చేసిన వాళ్లే సాధారణంగా క్షమాభిక్ష అడుగుతారని, మరి తప్పు చేయలేదని, మగాణ్నే కానని చెబుతున్న బాబా క్షమాభిక్ష ఎలా అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. పైగా కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు ఆయన.
బాబా సిర్సాలోని తన ఆశ్రమంలో 400 మంది యువకులకు వృషణాలు తొలగించి నపుంసకులను చేశారని కేసొకటి గతంలో నమోదైంది. ఆశ్రమంలో తాను తప్ప మరే మగ వ్యక్తీ ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన ఈ దారుణానికి తెగబడ్డాడని ఆశ్రమంలో పనిచేసిన వ్యక్తి ఒకరు చెప్పారు.