రేప్ కేసులో జైల్లో కటకటాలు లెక్కిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్ సన్నిహితురాలు కుమార్తె హనీప్రీత్ ఇన్సాన్ నేపాల్ కు పారిపోయినట్లు తెలుస్తోంది. బాబాను పోలీసు కస్టడీ నుంచి తప్పించడానికి యత్నించారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. దీంతో పోలీసులు ఆమెపై లుకౌట్ నోటీసులు జారీ చేసి ముమ్మరంగా గాలిస్తున్నారు. విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు.
అయినా ఆమె పారిపోయినట్లు భావిస్తున్నారు. గత శుక్రవారం పంచకులలోని కోర్టు బాబాకు శిక్ష విధించినప్పుడు ఆయనను పోలీసు కస్టడీ నుంచి తప్పించి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లేందుకు హనీ పక్కా పథకం వేశారు. అయితే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆమె పన్నాగం పారలేదు. హనీ బాబాకు పెంపుడు కూతురు. అయితే వీరి మధ్య శారీరక సంబంధాలున్నాయని హనీ భర్త అంటున్నాడు. తనను బాబా బెదిరిస్తున్నారని చెబుతున్నాడు. వేల కోట్ల డేరా బాబా ఆస్తులకు హనీనే వారసులురాలని వార్తలొస్తున్నాయి.