డేరా బాబా అనుచరుడి ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

డేరా బాబా అనుచరుడి ఆత్మహత్య

September 4, 2017

డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్ రేప్ కేసులో దోషిగా తేలి ఊచలు లెక్కపెడుతుండటాన్నిఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు రోడ్లపైకొచ్చి అల్లర్లకు పాల్పడుతోంటే మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు.

అంబాలా జైల్లోని  అనుచరుడు సోమవారం ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకున్నారు. అతణ్ని ఉత్తరప్రదేశ్ లోని సర్సావా వాసి రవీంద్రగా గుర్తించారు. డేరా బాబా కు శిక్ష పడ్డాక అల్లర్లకు దిగిన కేసు అరెస్టియన వాళ్లలో రవీంద్ర ఒకడు. అతణ్ని పంచకులలో అదుపులోకి తీసుకుని అంబాలా జైలుకు తరలించారు. మేజిస్ట్రేట్ ఆదేశంపై పోలీసులు ఈ ఆత్మహత్యకేసులో దర్యాప్తు ప్రారంభించారు.