Home > Flash News > అద్భుతమైన చంద్రుడి ఫోటో…గురు పౌర్ణమి స్పెషల్..!

అద్భుతమైన చంద్రుడి ఫోటో…గురు పౌర్ణమి స్పెషల్..!

హే మూన్, రైప్ కార్న్ మూన్, థండ‌ర్ మూన్…పౌర్ణమి రోజు వచ్చే నిండు చంద్రుడి పేర్లు…ఇంతకీ గురు పూర్ణిమ‌తో పాటు ఈ పేర్లు పెట్టిందెవరో తెలుసా అమెరికా కు చెందిన గ్రేట్ నాసా…గురు పూర్ణిమ 2017 కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేసింది. ఈ సారి గురు పౌర్ణ‌మి రోజున వ‌చ్చే నిండు చంద్రుడికి చాలా పేర్ల‌ను పెట్టింది. గురు పూర్ణిమ‌తో పాటు హే మూన్, రైప్ కార్న్ మూన్, థండ‌ర్ మూన్ పేర్లు పెట్టిన‌ట్లు ట్వీట్ లో తెలిపింది.

గురు పూర్ణిమ‌… గురువుల‌ను, పెద్ద‌ల‌ను పూజించే పండుగే. దీన్నే వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. ప్ర‌తి సంవ‌త్స‌రం ఆషాఢ శుద్ధ పౌర్ణ‌మి రోజున హిందువులు గురు పూర్ణిమ ను జ‌రుపుతారు. ఈ రోజు వ్యాసుడి పుట్టిన రోజ‌ని చ‌రిత్ర చెబుతుంది. గురు పూర్ణిమ రోజు చాలా మంది ఉప‌వాసం ఉండి సాయంత్రం చంద్రుడు ఉద‌యించిన త‌ర్వాత అన్నం తింటారు. ఇదే పౌర్ణమి స్పెషల్..

మొత్తానికి హిందువులు జ‌రుపుకునే గురు పూర్ణిమ గురించి నాసా.. ట్వీట్ చేసినందుకు భార‌త్ కు చెందిన నెటిజ‌న్లు నాసా శభాష్ అంటున్నారు.

Updated : 8 July 2017 6:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top