రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని.. హంగ్ వస్తుందని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంకట్‌రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని.. ఆ మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న బీఆర్‌ఎస్ మరోసారి పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు.
హాంగ్ వస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు గుత్తా సుఖేందర్ రెడ్డి. బండి సంజయ్ చేసిన దండుపాళ్యం వ్యాఖ్యలు వారికే వర్తిస్తాయని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఇక షెడ్యుల్ ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని.. ముందస్తుకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. వామపక్షాలతో పొత్తు ఉంటుందని భావిస్తున్నానన్నారు.