Guthikoyas are not Telangana residents: Minister Satyavathy Rathore
mictv telugu

గుత్తికోయలు మనోళ్లు కాదు.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు

November 25, 2022

Guthikoyas are not Telangana residents: Minister Satyavathy Rathore

తెలంగాణలో పోడు భూముల విషయంలో సమస్యగా మారిన గుత్తికోయలపై గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుత్తికోయలు ఈ రాష్ట్రం వారు కాదనీ, తెలంగాణ సంక్షేమ పథకాలకు అర్హులు కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల చట్టాలు రాష్ట్ర గిరిజనులకే తప్ప గుత్తికోయలకు వర్తించదని స్పష్టం చేశారు.

ఫారెస్ట్ అధికారులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస రావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి గుత్తికోయలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కొట్టిపారేశారు. అటు శ్రీనివాస్ హత్యతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఆపరేషన్ వెపన్స్ పేరుతో గుత్తికోయలు ఉండే ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేశారు. వారి నుంచి పెద్ద సంఖ్యలు విల్లంబులు, బల్లెంలు వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వారి దగ్గర ఆయుధాలు లేకుంటే దాడులకు ఆస్కారం ఉండదని అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.