ఎగరడానికి సిద్ధమవుతోన్న గువ్వ గోరింక
చాలా సినిమాలు వచ్చాయి..పోయాయి..కానీ మా సినిమా అలా కాదు. తెలుగు ప్రేకక్షుల గుండెల్లో గూడు కట్టుకుంటుంది. గువ్వ గోరింక అయి వాళ్ల మదిని దోస్తుందని గువ్వగోరింక సినిమా యూనిట్ అంటోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్..వినూత్నమైన ఆలోచనలతో వచ్చిన సినిమాల్ని తెలుగు ప్రేకక్షలు ఆదరిస్తారు. మౌత్ పబ్లిసిటీతోనే అలాంటి చిత్రాలను హిట్ కొట్టిస్తుంటారు. ఇప్పుడు అదే కోవలో రాబోతోన్న సినిమా గువ్వ గోరింక.
ఆకార్ మూవీస్ సంస్థ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ గువ్వగోరింక. సత్యదేవ్, ప్రియాలాల్, మధుమిత, ప్రియదర్శి, చైతన్య ప్రధాన తారలు. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకత్వంలో దాము కొసనం, దళం జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇదొక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ , మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక అని అన్నారు. విభిన్న మనస్తత్వం కలిగిన ఇద్దరు ప్రేమికుల కథను దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడని, కొత్తతరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే చిత్రమిది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ బొబ్బిలి, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, మాటలు: బజారా, సినిమాటోగ్రఫి: మైల్స్ రంగస్వామి, ఆర్ట్: సాంబ, కాస్ట్యూమ్స్: వినూత్న శత్రు, ఎడిటర్: గ్యారి బిహెచ్.