ప్రపంచంలోనే అతిపెద్ద దీపం.. 200 లీటర్ల నూనె.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రపంచంలోనే అతిపెద్ద దీపం.. 200 లీటర్ల నూనె..

October 27, 2019

Diwali.....

దేశవ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మట్టి దీపాలను, లోహ దీపాలను వెలిగిస్తూ లోకాన్ని వెలుగుమయం చేస్తున్నారు. సాధారణంగా ఇళ్లలోగానీ, గుళ్లలోగాని చిన్న మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తుంటారు. వెరైటీ కోసం కొందరు డిజైనర్ కొవ్వొత్తులను కూడా వెలిగిస్తున్నారు. ప్రత్యేకత కొత్త కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుంటుంది. అస్సాంలోని గువాహటిలో అలాంటి అద్భుతం ఒకటి చోటు చేసుకుంది. దిఘోలి పకూరీ ప్రాంతవాసులు ప్రపంచంలోనే అతి పెద్ద మట్టి దీపాన్ని వెలిగించి రికార్డు సృష్టించారు. 

దీపావళి సందర్భంగా స్థానిక సరస్సు ఒడ్డున ఈ అఖండ దీపాన్ని ముట్టించారు. ఈ ప్రమిద వ్యాసార్థం ఏకంగా 8 అడుగులు. ఎత్తు రెండు అడుగులు. ఇందులో 200 లీటర్ల నూనె నింపారు. వత్తి కూడా పెద్దదే. పశువులకు కట్టే పగ్గం తాడును వత్తిగా వేశారు. రాష్ట్ర గవర్నర్ జగదీశ్ ముఖిల్ దీన్ని వెలిగించారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ముప్పు గురించి అవగాహన కల్పించడానికి దీన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.