విశాఖ విషవాయువు.. అందరూ మాస్కులు పెట్టుకోండి..  - Telugu News - Mic tv
mictv telugu

విశాఖ విషవాయువు.. అందరూ మాస్కులు పెట్టుకోండి.. 

May 7, 2020

GVMC Tweet On Gas Leakage

గ్యాస్ లీకేజీ ఘటన విశాఖ వాసులను కలవరానికి గురి చేస్తోంది. ఆర్ ఆర్ వెంకటాపురం సమీపంలో ఎల్‌జీ పాలిమర్స్‌లో విష వాయువు లీకేజీతో వందలాది మంది ఆస్పత్రి పాలయ్యారు. దీంతో వెంటనే జీవీఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫ్యాక్టరీ చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తున్నారు. అందరూ మాస్కులు పెట్టుకొవాలని చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

ముందు జాగ్రత్తగా ప్రజలంతా ముక్కు,నోరు మూసి ఉంచేలా మాస్కులు, గుడ్డలు కట్టుకోవాలని చెబుతన్నారు. ఈ ప్రభావం తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని జీవీఎంసీ ట్వీట్ చేసింది. ఏఏ ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుందో తెలిసేలా ఓ మ్యాప్ కూడా పోస్ట్ చేశారు. కాగా ఇప్పటికే ఈ ఘటనలో 8 మంది మరణించారు. వైద్యులు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా దీనిపై దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. బాధితులు వెంటనే కోలుకోవాలని ఆశించారు. అధికారులు కావాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు వేగంగా చేపట్టాలని సూచించారు. ఈ విషయవాయువుల కారణంగా కళ్ల మంటలు, తల తిరగడం, శరీరంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారింది.