Gyanvapi mosque case: Varanasi court to pronounce verdict today, police impose Section 144
mictv telugu

జ్ఞానవాసి కేసుపై నేడే కోర్టు తీర్పు.. వారణాసిలో హై అలర్ట్

September 12, 2022

జ్ఞానవాసి మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. సున్నితమైన అంశం కావటంతో ఇప్పటికే వారణాసిలో హై అలర్ట్ ప్రకటించారు. 144 సెక్షన్ విధించారు. తీర్పు తర్వాత ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ఇప్పటికే ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఈ అంశంపై ఇప్పటికే వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ తుది తీర్పు వెల్లడించనున్నారు.

మసీదు కాంప్లెక్స్ లోని హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ ఐదుగురు మహిళలు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది. అయితే అది శివలింగం కాదని మసీద్ కమిటీ వాదిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఐతే సుప్రీంకోర్టు మాత్రం వారణాసి కోర్టుకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో కేసు వాదనలు వారణాసి కోర్టు పుర్తయ్యాయి. కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకవేళ ఈ తీర్పు వ్యతిరేకంగా వస్తే.. అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్తామని ఇప్పటికే పిటిషన్లు స్పష్టం చేశారు.