జ్ఞానవాపి మసీదు కొలనులో శివలింగం! సీజ్ చేయాలని కోర్టు ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

జ్ఞానవాపి మసీదు కొలనులో శివలింగం! సీజ్ చేయాలని కోర్టు ఆదేశం

May 16, 2022

కాశీలోని జ్ఞానవాపి మసీదులో తనిఖీ పూర్తయ్యాయి. అక్కడి కొలనులో శివలింగం బయటిపడిందని హిందువుల తరఫు న్యాయవాది వెల్లడించారు. దీంతో ఆ ప్రాంతాన్ని సీజ్ చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది. ఈ మసీదులో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని, వాటిని పూజించడానికి తమకు అనుమతివ్వాలని ఐదుగురు హిందువులు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతాన్ని మొత్తం వీడియో తీసి తమకు అందజేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. అయితే అతి తమ ప్రైవేటు ప్రార్థన మందిరమంటూ మసీదు నిర్వాహకులు ఒప్పుకోలేదు. చివరికి కోర్టు ఆదేశంతో వీడియో చిత్రీకరణ ఈ రోజు ముగిసింది.

‘మసీదులో ప్రార్థనముందు శుద్ధి చేసుకోడానికి(వజూ) కోసం వాడే కొలను నుంచి నీటిని పూర్తిగా తోడేయడంతో శివలింగం బయటపడింది. మసీదులో హిందూ దేవతల విగ్రహాలను ఏడాదంతా పూజించడానికి అనుమతివ్వాలి’ అని పిటిషనర్ల న్యాయవాది శుభాష్ నందన్ చతుర్వేది కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు.. ఆ కొలనును ఎవరూ వాడకుండా స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించింది. 17వ శతాబ్దిలో ఔరంగజేబు కాశీ ఆలయాన్ని నిర్మూలించిన ఈ మసీదును కట్టించాడు. హిందూ ఆలయ ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి.