యూఎస్ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS).. హెచ్ 1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ మార్చి1న ప్రారంభమై మార్చి 17 2023 ముగుస్తుంది. పిటిషనర్లు, ప్రతినిధులు ఆన్ లైన్ హెచ్ 1బీ రిజిస్ట్రేషన్ సిస్టమ్ myUSCIS ని ఉపయోగించి రెజిస్ట్రేషన్లను పూర్తి చేయాలి.
హెచ్ 1 బీ వీసా అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికన్ కంపెనీలను అనుమతిస్తుంది. ప్రతీ సంవత్సరం టెక్నాలజీ కంపెనీలు చైనా, భారతదేశం వంటి దేశాల నుంచి వేలాది మందిని నియమించుకుంటాయి. దానికోసం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
FY 2024 H-1B కోసం సమర్పించిన ప్రతి రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ నంబర్ ను అందుకుంటుంది. ఆ నంబర్ ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ ను ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. ఈ నంబర్ రిజిస్ట్రేషన్ లను ట్రాక్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ప్రతి లబ్దిదారుడు తప్పనిసరిగా ఖాతాను ఉపయోగించి నమోదు చేసుకోవాలి. ప్రతి రిజిస్ట్రేషన్ కు ఫీజుగా 10 డాలర్లు చెల్లించాలి.
ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఎలా..?
– రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేయడానికి myUSCIC ఖాతాను తెరువాలి. దరఖాస్తుదారు 10 డాలర్లు నాన్ రిఫండబుల్ మొత్తాన్ని చెల్లించాలి.
https://myaccount.uscis.gov/users/sign_up ద్వారా లాగిన్ అవ్వాలి.
– తమ స్వంత రిజిస్ట్రేషన్ లను సమర్పించేవారు ‘రిజిస్ట్రెంట్’ఖాతాను ఉపయోగించాలి.
– కొత్త ఖాతా సృష్టి ప్రక్రియ ఫిబ్రవరి 21నే ప్రారంభమైంది. ఖాతా సృష్టించి తర్వాత, ప్రతినిధులు ఎప్పుడైనా తమ ఖాతాలకు ఖాతాదారులను జోడించుకోవచ్చు.
– ప్రతినిధులు, రిజిస్టర్లు లబ్దిదారుల వివరాలను నమోదు చేయడానికి మార్చి 1 వరకు వేచి ఉండాలి. అప్పుడే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
– చివరి చెల్లింపు వరకు ఖాతా ద్వారా సమాచారాన్ని డ్రాఫ్ట్ గా సవరించడం, ఏవైనా మార్పులు చేయడంలాంటివి ఫైనల్ పేమెంట్ అయితే మార్చడానికి వీలు కాదు.
– అమెరికా ప్రభుత్వం మార్చి 31 నాటికి తుది ఎంపికల గురించి ఖాతాదారులకు తెలుస్తుంది.
– మార్చి 17నాటికి డిపార్ట్ మెంట్ తగినంత దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇందులో నుంచి myUSCIS ఆన్ లైన్ ఖాతాల ద్వారా వచ్చిన నోటిఫికేషన్ లను పంపుతుంది. ఈ ఎంపిక కోసం రిజిస్ట్రేషన్ వ్యవధి ముగిసే వరకు వేచి ఉంటుంది.
– అనుమతి పొందిన తర్వాత దరఖాస్తుదారులు తమ అధికారిక, వివరణాత్మక హెచ్ 1బీ పిటీషన్ లను USCISకి సమర్పించాలి. ఈ ప్రాసెస్ మొత్తం 90 రోజుల్లో పూర్తవుతుంది.