ఫేస్ బుక్కైంది.... - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్ బుక్కైంది….

September 12, 2017

 

సోషల్ మీడియా కు కేరాఫ్ అడ్రస్ అయినా ఫేస్ బుక్ సంస్థ అడ్డంగా బుక్ అయింది. తన యూజర్ల ఖాతాల వివరాలు, వారివ్యక్తిగత సమాచారాన్ని ఇతరులు  తీసుకోకుండా కట్టడి చేయడంలో విఫలం అయిందని…. అందుకే దానికి 1.4 మిలియన్  డాలర్ల జరిమానా  విధిస్తున్నట్లు స్పెయిన్ కు చెందిన డేటా ప్రొటెక్షన్ సంస్థ  చెప్తున్నది.  యూజర్ల అనుమతి లేకుండా ప్రకటన కర్తలకు   ఎట్లా సమాచారం ఇస్తారని సదరు సంస్థ ప్రశ్నించింది. అంతే కాదు యూజర్ల  సమాచారాన్ని రక్షించడంలో కూడా  ఫేస్ బుక్ విఫలం అయిందనే విమర్శ కూడా చేసింది.

ఫేస్ బుక్ పాలసీనే సరిగ్గా లేదని ఆరోపించింది. తమ దేశానికి చెందిన  యూజర్ల డేటాను ఫేస్ బుక్ సంస్థ  సంరక్షించడం లేదని ఆరోపిస్తూ గతంలో ఫ్రాన్స్ కు చెందిన ఓ సంస్థ కూడా 1.50 లక్షల యూరోల జరిమానా విధించింది. ఫేస్ బుక్ సంస్థ ఇప్పటికైనా యూజర్ల సమాచారాన్ని  రక్షించాలని యూజర్లు కోరుతున్నారు.