Hackers stole three billion dollars worth of crypto currency
mictv telugu

చరిత్రలోనే అత్యంత భారీ చోరీ.. రూ. 24 వేల కోట్లు కొట్టేశారు

October 17, 2022

Hackers stole three billion dollars worth of crypto currency

సైబర్ మోసాల గురించి రోజూ మనం వివిధ మీడియా సాధనాల ద్వారా వింటూ ఉంటాం. బ్యాంకు అకౌంట్ల వివరాలు అపరిచితులకు ఇవ్వవద్దని, అనవసర లింకులను క్లిక్ చేయవద్దని బ్యాంకులు, పోలీసులు హెచ్చరిస్తుంటారు. కానీ, ఇప్పుడు నేరగాళ్లు కొత్త పంథా ఎన్నుకున్నారు. బ్యాంకు అకౌంట్ల ద్వారా దోపిడీకి పాల్పడితే దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు క్రిప్టో కరెన్సీపై పడ్డారు.

విలువ ఎక్కువుండే ఈ కరెన్సీని ఈ ఒక్క ఏడాదిలోనే మూడు బిలియన్ డాలర్ల మేర హ్యాక్ చేసి దోచుకున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 24 వేల కోట్లన్నమాట. 125 సార్లు హ్యాకింగ్ చేసి ఇంత మొత్తం చోరీ చేశారని బ్లాక్ చెయిన్ అనాలటిక్స్ ఫర్మ్ చైనాలిసిస్ వెల్లడించింది. గతేడాది 2.1 బిలియన్ డాలర్లు దోపిడీకి గురవగా, ఈ ఏడాది ఆ రికార్డు బద్దలయింది. అదీకాక, కేవలం ఈ అక్టోబర్ నెల 15 రోజుల్లోనే 11 సార్లు ప్రయత్నించి సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. కాగా, క్రిప్టో కరెన్సీ అనేది డిజిటల్ కరెన్సీ లాంటిది. ఇందులో బిట్ కాయిన్ విలువ చాలా ఎక్కువ. ఒక్క కాయిన్ విలువ సుమారు రూ. 15 లక్షలుంటుంది. దీని తర్వాత స్థానం ఇథీరియం విలువ సుమారు రూ. 1 లక్ష ఉంటుంది. దీంతో సైబర్ నేరగాళ్లు దీన్ని టార్గెట్ చేశారని నిపుణులు భావిస్తున్నారు. అటు ఈ కరెన్సీపై ప్రభుత్వ నియంత్రణ ఉండదు. వ్యక్తిగత స్థాయిలోనే లావాదేవీలు నిర్వహించుకుంటారు.