లష్కరేలో కుమ్ములాట.. హఫీజ్ కొడుకుపై హత్యాయత్నం! - MicTv.in - Telugu News
mictv telugu

లష్కరేలో కుమ్ములాట.. హఫీజ్ కొడుకుపై హత్యాయత్నం!

December 10, 2019

Hafiz sayeed son Lahore 

ముంబై దాడులు సూత్రధారి, కరడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్ కొడుకుపై హత్యాయత్నం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 7న పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర రాజధాని లాహోర్‌లో ఈ సంఘటన జరిగింది.  సయీద్ కొడుకు, లష్కరే డిప్యూటీ నేత తల్హా సయీద్‌ను మట్టుబెట్టేందుకు పేలుడుకు పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి. తల్హా స్వల్ప గాయాలతో తప్పించుకోగా, మరొకరు చనిపోయారు. లష్కరేకు చెందిన ఆరుగురు గాయపడ్డారు. అయితే ఇది దాడి కాదని, ఓ రిఫ్రిజిరేటర్ల దుకాణంలో కంప్రెషర్‌ను పేల్చారని అధికారులు చెబుతున్నారు.  

భారత నిఘా విభాగం ‘రా’ ఈ పేలుడుకు పాల్పడి ఉండొచ్చని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఆరోపిస్తున్నాయి. అయితే కొన్ని ఉగ్రవాద సంస్థలు ఈ వాదనతో విభేదిస్తున్నాయి. తల్హాకు తన తదనంతరం లష్కరే అధినేతగా బాధ్యత కట్టబెట్టాలని హఫీజ్ తీసుకున్న నిర్ణయం కొంతమంది సీనియర్ నేతలకు నచ్చడం లేదని, ఈ నేపథ్యంలో అతనిపై దాడి జరిగిందని అంటున్నారు.