వడగళ్లా...క్రికెట్ బాల్సా..! - MicTv.in - Telugu News
mictv telugu

వడగళ్లా…క్రికెట్ బాల్సా..!

June 3, 2017


వేసవిలో అకాల వర్షం వచ్చిదంటే వడగళ్లు కామన్..కానీ మరి క్రికెట్ బాల్ సైజులో వడగళ్లు పడుతున్నాయి. ఇప్పటిదాకా చిన్న చిన్న రాళ్ల వానను చూసిన జనం.. వీటినిచూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ రాళ్లు ఎక్కడ పడ్డాయంటే…

రాజస్థాన్ లో మండు వేసవిలో వడగళ్ల వాన కురిసింది. అదీ మామూలుగా కాదు. ఫిరంగి గుళ్లలా రాళ్లు పడ్డాయి. బుండి జిల్లాలోని బసవాడలో గత నెలలో వడగళ్ల వాన పడుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలోపెట్టాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. అవి ఒక్కొక్కటి క్రికెట్‌ బాల్ సైజులో ఉన్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్లే ఇలా జరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
https://www.youtube.com/watch?v=y26r5Hq0DeI