కారు డోర్ తెరిచేస్తా.. సింహం హల్‌చల్ (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

కారు డోర్ తెరిచేస్తా.. సింహం హల్‌చల్ (వీడియో) 

February 21, 2020

cgv bcgn

సఫారీ కారులో వన్య ప్రాణులను అత్యంత సమీపంలో చూస్తుంటాం. పులులు, సింహాలను అలా చూడ్డం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అయితే అన్నీ సందర్భాలలో అలా వెళ్లడం అంత మంచిది కాదు. ఎందుకంటే అవి క్రూర మృగాలు. వాడి కోరలు, గోళ్లతో ఏమైనా చెయ్యగలవు. ఈ వీడియోలో సింహం అదే పని చేసింది. అందులో ఒక సఫారీ కారు, దానికి రక్షణగా మరో రెండు వాహనాలు ఉన్నాయి. ఆ కారుపైకి ఓ సింహం అమాంతం ఎక్కేసింది. అంతటితో ఆగకుండా దానికి తోడుగా మరో రెండు సింహాలను ఎక్కండి అని సైగ చేసింది. అంతే మరో రెండు సింహాలు కూడా కారెక్కాయి. వాటి బరువుకి కారు బానట్ వంగిపోయుంటుంది. 

A white Jeep! My favourite from AnimalsBeingJerks

తొలుత ఎక్కిన సింహం కారు అద్దాన్ని కొరకడం మొదలెట్టింది. అనంతరం కారు డోరు తీయటానికి ప్రయత్నించింది. కానీ అది తెరుచుకోలేదు. కాసేపు అయ్యాక డ్రైవర్‌ కారును మెల్లగా వెనుకకు నడిపాడు. దీంతో ఆ సింహం కూడా దిగిపోయి తన దారి తాను చూసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కారు తలుపు తెరుచుకోలేదు కాబట్టి సరిపోయింది.. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది అని అంటున్నారు. ఆ మూడు సింహాలు కారు మీద ఉండి, అద్దాలను, డోర్లను తెరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు లోపలు ఉన్నవారి పరిస్థితి ఎంత ఆందోళనగా ఉందో ఊహిస్తుంటేనే టెన్షన్ పుడుతోందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కొంపదీసి వాటి బరువుకి కారు అద్దాలు పగిలిపోయినా పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అని వాపోతున్నారు.