గదేం బుద్ధే తల్లీ.. మత్తు మందిచ్చి జుట్టు కత్తిరించుడు !? - MicTv.in - Telugu News
mictv telugu

గదేం బుద్ధే తల్లీ.. మత్తు మందిచ్చి జుట్టు కత్తిరించుడు !?

August 3, 2017

ఇప్పటి వరకు మనం రకరకాల మనుషులను చూసినం. కనీ వెంట్రుకలు కత్తరిచ్చే డిఫ్ రెంట్ మనుషులను చూసిర్రా ? ఏందీ వెంట్రుకలు కట్ చేసుడా ? గదేం బుద్దీ ? చిత్రంగున్నదే.. అని ముక్కు మీద వేలు పెట్టుకుంటున్నరా !? అయితే ముక్కు మీద వేలేంటి జుట్టు పీక్కోవాల్సిందే. ఎందుకిట్ల వెంట్రుకలనే కత్తరిస్తున్నది ఆమె ? ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఢిల్లీ లాంటి మహా నగరంలో ఒక మాయ లేడి ఇతర లేడీల జడలు కత్తరిస్తున్నదట. ఆమె ఎవరు ? ఎక్కణ్ణుంచి వచ్చింది ? ఎందుకిట్ల వెంట్రుకలనే కత్తరిస్తున్నది ? అనేది పేద్ద సస్పెన్స్ థ్రిల్లరు ?? అక్కడి పోలీసోల్లు ఆమెను పట్టుకునే కార్వాయి షురూ చేశిర్రట. ఇప్పటి వరకు ఢిల్లీలనే ఇటువంటివి 15 కేసుల వరకు నమోదైనయి.

అట్లనే మథుర జిల్లాలోని వివిధ గ్రామాల్లో, గుర్గావ్ లో కూడా ఇటువంటి కేసులు బుక్కైనయి. కొందరు ఆడోళ్ళు దవాకాన్లల్ల షరీకై చికిత్స పొందుతున్నరట. ఒక బాధితురాలు మాత్రం ఆమెను చూసిందట. పెద్ద కనుగుడ్లతోని బెదురు బెదురు సూస్తదని చెప్పింది. మెల్లెగ మాట కలిపి స్పృహ కోల్పోయేటట్టు చేసి వెంట్రుకలు కట్ చేసి చెక్కేస్తుదంట. లేదా నిద్రపోతున్న ఆడోళ్ళను టార్గెట్ చేసి వాళ్ళకు తెలియకుండా వెంట్రుకలు కట్ చేసి కింద పారేసి వెళ్ళిపోతుందట. తనెందుకిలా చేస్తుందనేది లక్ష డాలర్ల సవాలు ??

తల వెంట్రుకలు జర పెద్దగ కన్పిచ్చిన ఆడోళ్ళను జూస్తే ఆమెకు కండ్లు ఓర్సెటట్టు లేవు. ఫ్లాష్ బ్యాకుల ఆమెకు పెద్ద జడ వచ్చి వెంట్రుకలన్నీ రాలిపోయుంటయి.. అందుకే ఇట్ల తనకు లేని జడ ఎవ్వర్కి వుండద్దని పగ వట్టినట్టున్నది. ఆమె బారిన పడి ఇప్పటివరకు పొడువు పొడువు జడలను పోగొట్టుకొని క్యావ్ మంటున్న ఆడోళ్ళ కేసులు పెరిగిపోతున్నయట ! పోలీసులు 323, 354 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసి నిందుతురాలి కోసం వేట మొదలు పెట్టిర్రంట. వెంట్రుకలను కత్తరిచ్చుకుంట హల్ చల్ చేస్తున్న ఆమె ఎందుకిట్ల వెంట్రుకలను కట్ చేసేస్తుందనేది ఆమె దొర్కుతెనే అన్నీ బైటకస్తయి. పోనీ కట్ చేసిన వెంట్రుకలను సవురాలకు అమ్ముకుంటున్నదా అంటే అదీ లేదు. కట్ చేసి అక్కడనే కింద పారేసి వెళ్ళిపోతోందంట. మరి ఆ వెంట్రుకలతోని ఏమైనా మంత్ర తంత్రాలు చేస్తున్నదా అనే సస్పెన్సులన్నీ ఆమె దొర్కుతనే బైటకస్తయి. ఆ పనేదో ఆడోళ్ళకు చేసే కన్నా మొగోళ్ళకు చేస్తే బాగుండు. జుట్టు పెరిగి బార్బర్ షాపుకు పోయి కటింగ్ జేస్కునే తీరిక లేని మొగోళ్ళ జుట్టును గామె కత్తరిచ్చుంటే ఏ లొల్లి వుండకు పోవు కదా !